Also very happy to know that Telugu is identified as Classical languge by central govt.
మా తెలుగు తలికి మల్లెపూ దండ
మా కన్న తలీకి మంగళహారతులు
తెలుగు, కన్నడ భాషలను ప్రాచీన భాషలుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంగా ఈ కానుక ప్రకటించినట్లు పేర్కొంది. అయితే భాషలకు ప్రాచీనహోదా కల్పించడానికి కేంద్రం నిర్దేశించిన అర్హతలపై భాషా నిపుణుల సంఘం సభ్యుడొకరు మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వెలువడే తీర్పునకు లోబడే ఈ ఆదేశాలు అమలవుతాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు.కోర్టు తీర్పు వెలువడిన నాటి నుంచే ప్రాచీన హోదా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ''కన్నడ, తెలుగులను ప్రాచీనభాషలుగా గుర్తించాలని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి మాకు అనేక వినతిపత్రాలు అందాయి. వీటన్నింటినీ భాషానిపుణుల సంఘానికి నివేదించాం. తాజాగా ఈ సంఘం తెలుగు, కన్నడాలను ప్రాచీన భాషలుగా గుర్తించవచ్చని సిఫారసు చేసింది. నవంబర్ 1న రెండు రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని వీటిని ప్రాచీన భాషలుగా గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. అయితే ఇది మద్రాస్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌పై తీర్పునకు లోబడి ఉంటుంది. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ కేంద్రం కోర్టును కూడా ఆశ్రయించింది'' అని వివరించారు. ఈ వ్యవహారంపై కోర్టు స్టే ఇవ్వకపోవడం వల్ల తాము ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది మంది సభ్యులున్న భాషా నిపుణుల కమిటీలో ఏడుగురు తెలుగు, కన్నడలకు ప్రాచీనహోదా కల్పించడానికి ఆమోదముద్ర వేయగా, ఒకరు వ్యతిరేకించారని సోనీ పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించిన 1500 ఏళ్ల చరిత్రను ఆధారంగా చేసుకొనే ప్రాచీనహోదా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఎంతమేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో తనకు తెలియదనీ, అది తన శాఖ పరిధిలోకి రాదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భాషా నిపుణులకు అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు రావడానికీ, యూజీసీ, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విశిష్ట విద్యా కేంద్రాలను (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ఏర్పాటు చేసుకోడానికి అవకాశం ఉంటుందన్నారు. తెలుగు, కన్నడంతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నాలుగు భాషాలకు ప్రాచీనహోదా లభించినట్త్లెందని పేర్కొన్నారు. ఇంతకుముందు సంస్కృతం, తమిళంలకు ఈ గుర్తింపు లభించింది.
Courtesy: ఈనాడు
*****
Courtesy: ఈనాడు
*****
1 comment:
Happy AP formation da... :)
Post a Comment